![]() |
![]() |
.webp)
ఓటిటి ప్లాట్ఫారం మీద వచ్చే క్విజ్ షోస్ లో సర్కార్ షోకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటి వరకు ఇది 4 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద ఈ షో బాగా సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీజన్ 5 తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో గ్లిమ్ప్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదటి 3 సీజన్స్ కి ప్రదీప్ హోస్ట్ గా చేసాడు 4 వ సీజన్ కి ఇప్పుడు రాబోతున్న 5 వ సీజన్ కి సుధీర్ హోస్ట్ గా వున్నాడు. ఇక ఈ షో ప్రతీ శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాబోతోంది. జూన్ 6 నుంచి షో ఆడియన్స్ ముందుకు వచ్చేయబోతోంది.
"ఒకటే ఆట ఆడే నాకీ...ఏదోలా గెలిసే నాకీ ఇంత పెద్ద బతుకెందుకు..ఏదైనా ఈ స్టేజి మీద ఉన్నప్పుడే సేసెయ్యాల...ఆడతామా ఏటి మళ్ళీ...సర్కార్ సీజన్ 5 ..ఇక్కడ ఆడేది గెలవనీకి కాదు...నువ్వెందో అందరికీ తెల్వనీకి.." అంటూ తన కటౌట్ తో షో థీమ్ చెప్పాడు సుధీర్. సుధీర్ ని చూసిన నెటిజన్స్ ఐతే "గేమ్ చెంజర్ ఈజ్ బ్యాక్...ఆట మొదలయ్యింది. " అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సర్కార్ గేమ్ షో అనేది 2021 లో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఇంతవరకు అనన్య నాగళ్ళ, సుహాస్, కాజల్, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, నందిని రెడ్డి, మాళవికా నాయర్, బ్రహ్మాజీ, అల్లరి నరేశ్, నిహారిక కొణిదెల, సదా, కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, నవదీప్ వంటి ఎంతో మంది ఈ షోకి గెస్టులుగా వచ్చి మూవీ ప్రొమోషన్స్ చేసుకున్నారు గేమ్ షో ఆడారు. ఇక ఈ సీజన్ 5 కి ఎలాంటి గెస్టులు వస్తారో చూడాలి.
![]() |
![]() |